Friday, July 23, 2010

విజేత మీరే అనుకోండి...



    ఒక పోష్ట్ గ్రాడ్యుయేట్ చదువు పూర్తి చేసుకుని పదేళ్ళకు పైగా అయ్యింది,ఎక్కడా ఉద్యోగం రాలేదు,కనీసం ఎంప్లాయిమెంట్ ఆఫీసు నుంచి కూడా ఒక్క ఇంటర్యూ కూడ పిలుపు రాలేదు.అందుకని ఒక హొటల్ లొ క్యాషియరుగా పనిచేయడం మొదలుపెట్టాడు.అతని విద్యార్హతలకి,అతను చేస్తున్న ఉద్యోగానికి ఏవిధమైన సంభంధంలేదు.ఒకసారి కౌంటరులో డబ్బు తక్కువ వచ్చింది.అది ఏవిధంగా జరిగిందో అతనికి తెలియదు.ఆ అపనింద తనపై పడుతుందేమో అన్న భయం అతని మనసుని కలచివేసింది.ఎలాగైన ఆడబ్బుని భర్తీ చేద్దామని అతని భార్య నగలు తాకట్టు పెట్టాలనుకుని భార్యని అడిగాడు అందుకు ఆమె ఒప్పుకోలేదు,తల్లిని అడిగాడు అమె కూడా ససేమిరా అంది.అతని భార్య,తల్లికూడా తన గౌరవం కాపాడానికి సిద్దంగ్గలేరు అని ఎంతో కుమిలిపోయాడు.

    ఇక్కడ ఒక్కసారి అతన్ని క్షుణ్ణంగా పరిసీలిద్దాం, అతని తల్లి,భార్య నమ్మటం సంగతి పక్కన పెడితే అతన్ని అతనే నమ్మలేదు.బాగా లోతుగా ఆలోచిస్తే విపత్తులని అంగీకరించే ఆత్మస్తైర్యం అతనికి లేదు,అందుకే ఇష్టం లేని ఉద్యోగాన్నే అంటిపెట్టుకుని వున్నాడు.ఉద్యోగం అంటే అఐష్టం కాబట్టి పని మీద పూర్తిగా మనసు పెట్టి చేయలేకపొయాడు,దానివల్లే ఎంత డబ్బు తక్కువయ్యిందో కూడా గమనించుకోలేకపోయాడు.సమస్య అతని భార్యో ,తల్లో కాదు.అసలు అతనికి అతనే పెద్ద సమస్య.అతనిలోని ఆత్మ స్తైర్యం లోపించడమే అతని మొదటి సమస్య ముందుదాని నుండి అతను బయటపడాలి.

    
    ఆత్మస్థైర్యం పెంచుకోడానికి ముఖ్యంగా మూడు లక్షణాలు తప్పక నేర్చుకోవాలి.మొదటిది ఎప్పుడూ కలతలకి,ధుఖాలకి కృంగిపోకూడదు.రెండవది ఇష్టమైన ఒక రంగంలో,లేదా,ఇష్టమైన పనిలో ప్రావీణ్యం సంపాదించుకోవాలి.మూడవది బాధ్యత స్వీకరించడం నేర్చుకోవాలి.చదువూ,డబ్బు లేనివారు,చివరికి కాళ్ళూ చేతులు లేనివారు కూడా జీవితoలో విజయం సాధించారు.అలాంటివారు చాలామందేవున్నారు.కాని ఆత్మస్థైర్యం లేకుండా విజయం సాధించినవారు ఒక్కరూ లేరు.

   అబ్రహం లింకన్ జీవితాన్నే చూద్దాం లెక్కలేనన్ని అపజయాలు ఎదురయ్యాయి.ఏడవ ఏట కుటుంబ వివాదాల వల్ల అతని కుటుంబం వీధిన పడింది.9వ ఏట తల్లి మరణించింది,22వ ఏట గుమాస్తా ఉద్యోగం కాస్తా పోయింది,25వ ఏట లెజిస్లేటర్ ఎన్నికలలో ఓడిపొయాడు,27 వ ఏట నాడీ మండలం దెబ్బతింది,28వ ఏట ప్రియురాలిని పోగోట్టుకున్నాడు,30 వ ఏట స్పీకర్ ఎన్నికలలో ఓడిపోయాడు,35 వ ఏట కాంగ్రెస్ ఎన్నికలలో ఓడిపోయాడు.46 వ ఏట సెనటోరియల్ ఎన్నికలలో ఓడిపోయాడు,ఆ కాలంలోనే తన కొడుకుని పోగోట్టుకున్నాడు.47 వ ఏట వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలలో ఘోర పరాజయం పోందాడు,అయినా ఎంతమాత్రం అతని ఆత్మస్థైర్యం చెక్కుచెదరలేదు.ఈ పరాజయాలన్ని అతని ఆత్మస్థైర్యాన్ని ఏ మాత్రం కృంగదీయలేదు.52 వ ఏట ఆయన అమెరికా అధ్యక్ష పదవి పోందాడు.
   కాబట్టి గతం మన ఆత్మస్థైర్యాన్ని కృంగదీయకుండా చూసుకోవాలి.                      






  

  
  

  

      

Tuesday, July 20, 2010

మనలో శక్తిని తెలుసుకుందాం

ప్రపంచ వ్యాప్తంగా జపాన్ దేశ వస్తువులకి ఎంత గిరాకీ వుందో ఎవ్వరికి వేరె చెప్పనక్కరలేదు.జపాన్ ఉత్పత్తులు తమ దేశంలో ప్రవేశిస్తాయేమోనని అమెరికా,ఇరోపా దేశాలు ఇప్పటికి భయపడుతూనేవున్నాయి.ఆటోమొబైల్ రంగంలో ముందంజలో వున్నహొండా కంపనీ ఎలా ప్ర్రారంభమయ్యిందో ఒకసారి చూసి దాని బట్టి మనం ఏమినేర్చుకోవాలో తెలుసుకుందాము.
హోండా అనే జపాన్ దేశస్థుడు హొండా కంపనేకి మూల కారకుడు.హొండా చాలా నిరాడంబరుడు.కార్లు బాగా నడిచేందుకు క్రొత్తరకం పిస్టన్ రూపొందించాలని ప్రయత్నించాడు.తన ప్రయత్నం విజయవంతము ఐతె,అది ఆటోమోబైల్ రంగంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకునిరాగలదని అతడు బలంగా నమ్మాడు .తను రూపోదించిన పిస్టన్ వివరాలను టొయోటా కంపనీవారికి చూపించాడు,కానీ వివరాలు తెలుసుకోకుండానే ఆ కంపనీ ఇంజనీర్లు అతని ప్రతిపాదనని త్రోసిపుచ్చారు.అలాగని హొండా నిరాశ చెందలేదు.టొయోటా కంపని ఇంజనీర్లని కలవడానికి పదేపదే ప్రయత్నించాడు.చివరికి అతని ప్రయత్నం ఫలించింది.కాని వాళ్ళు అతని క్రుషిని అభినందించడానికి బదులు హేళన చేసారు.అయినా సరే నిరుత్సాహపడలేదు,వివారాలన్నీ విపులీకరించి ఒప్పించగలిగాడు.చివరి టొయోటా కంపనికి పిస్టన్ తయారుచేసి ఇచ్చెందుకు ఆర్డరు సంపాదించాడు.
తన దగ్గరవున్న ఆస్తిని అమ్మి పిస్టన్లు తయారు చేసె ఫ్యాక్టరిని పెట్టాడు.అంతలో అకస్మాత్తుగా జపాన్లో భూకంపం వచ్చి ఆ ఫ్యాక్టరీ కాస్త నేల మట్టం అయ్యింది.ఐనాసరే తన సామర్ధ్యం మీద తనకి అపారనమ్మకం పెంచుకుని మళ్ళీ క్రొత్తగా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మొదలుపెట్టాడు,ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి అయ్యి ఉత్పత్తి ప్రారంభించే వారం రోజుల ముందు రెండవ ప్రపంచయుద్దం వచ్చి,జపాన్ మీద బాంబుల వర్షం కురిపించింది,జపాన్ దేశంతోపాటు హొండా కంపని కూడా సమూలంగా ద్వంసం అయిపోయింది.
ఆ సంఘటనతో తన ఫ్యాక్టరినీ,ఆస్తిని,స్నేహితులని,అందరిని పోగొట్టుకున్నాడు.హొండాకి మాత్రం ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు.తన ప్రయత్నాలు కొనసాగించి మూడోసారి ఫ్యాక్టరిని నిర్మించాడు.ఇవాళ కార్ల తయారిలో టొయోటా కంపనీ కంటే హొండా కంపనీ ముందంజలోఉంది.పట్టుదలకి మారుపేరే కాక హొండా అనే పేరుకే వన్నెతెచ్చాడు "హొండా".

చిన్నచిన్న పరాజయాలకీ మనం క్రుంగిపోతూవుంటాం,సమస్యలు వరుసగా వస్తే నిరాశకి గురవుతాము.విజయవంతులు ఎప్పుడు సమస్యలో ఒక భాగంగానే వుంటారు తప్పా సమస్యాబాధితులు మాత్రంకారు.మరికొతమందిని గురించి తెలుసుకుందాము.....

"ఇనస్టీన్" మొద్దూబ్బాయి అని ముద్ర వేసి అతడిని స్కూల్ నుండి పంపించివేసారు,దానితో అతను నిరాశచెంది చదువు మానేసివుంటే అంతటి శాస్త్రవేత్త గురించి ప్రపంచానికి తెలిసేదేకాదెమో!

"నార్మా జీన్ బేకర్"అనే అమ్మాయి మోడలింగ్ వ్రుత్తిని చెపట్టాలనుకుంది,మోడలింగ్ కంపెని ఆమెను తిరస్కరించింది,మోడలింగ్ బదులుగా ఒక గుమాస్తా వుద్యోగం ఇచ్చింది,అంతటితో ఆమె కలలకి సమాధి కట్టేసి వుంటే "మార్లిన్ మన్రో" అనే అందాల చలనచిత్ర నటి ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్వప్న సుందరి కాలేదెమో!
సహజంగా స్రుజనాత్మకత లేని కారణంగా ఒక వార్తాపత్రిక యజమాని ఒక చిత్రకారుడిని ఉద్యోగం లోంచి తీసేసాడు,కాని ఆ చిత్రకారుడు తన స్రుజనాత్మక శక్తితో "మిక్కీమౌస్" అనే బొమ్మకు ప్రాణంపోసి "వాల్ట్ డిస్నీ"అనే కార్టూన్ మహాసామ్రాజ్యానికి స్రుస్టికర్త అయ్యాడు.

"మనము తప్పక విజయము సాధిస్తాము" అన్న తపన మనలో ఎప్పుడు మనలో రగులుతూ ఉండాలి,దానిని మనం నీరుకార్చుకోకూడదు.విజయశిఖరాలు చేరుకోవాలంటే ఎన్నో అవరోధాలు ఎదుర్కోవలసి వస్తుంది.మధ్యలో నిరాశ చెంది ప్రయత్నాన్ని విరమించుకుంటే విజయాన్ని ఆస్వాదించలేము.

Monday, July 19, 2010

ఒక కారణం-రెండు ప్రభావాలు...

ఒక చిన్నగది,దాంట్లో తండ్రి,ఇద్దరు కొడుకులు వుడేవారు.ఆ తండ్రి ప్రతీరోజు తప్పతాగి వచ్చి,టివి చూస్తూవుండెవాడు.దానితో పిల్లలు చదువుకొనేందుకు ఇబ్బందిగా వుండేది.అయినా పెద్దకొడుకు పట్టుదలతో,ఎకాగ్రతతో చదువు సాగించాడు.చిన్నకొడుకు మాత్రం తన తండ్రి అడుగు జాడలలో నడవసాగాడు.ఇద్దరు కొడుకులు పెరిగి పెద్దవాళ్ళయ్యారు.

పెద్ద కొడుకు ఉత్తమ పౌరుడి పురస్కారాన్ని అందుకుంటే,చిన్న కొడుకు జైలుపాలయ్యడు.వారినిద్దరిని ఇంటర్యూ చెసినప్పుడు వారు చెప్పిన సమాధానాలు లోతుగా ఆ ఆలోచింపదగినవి"చిన్న కొడుకు, దీనికంతా కారణం మా తండ్రి స్రుష్టించిన చెడు వాతావరణం మూల కారణం అన్నాడు." పెద్ద కొడుకు ఈ విధంగా చెప్పాడు"నా విజయానికి కారణం నా తాగుబ్రోతు తండ్రి,ఇంట్లో చెడు వాతావరణం, చూసి వాటికి భిన్నంగా ఉండాలి అనే ఉత్తేజం నాలో బలంగా కలిగింది."అన్నాడు.
పరిస్థితి ఒకటే, కాని దాని ప్రభావం భిన్నంగా వుంది.ముఖ్యంగా పరిస్థితి కంటే ఆ పరిస్థితిలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేదే మన జీవితం యొక్క గొప్పదనాన్ని నిర్ణయిస్తుంది.

ఆలోచించండి...

రవీంద్రనాధ్ ఠాఘుర్ రచించిన కధలలో బిచ్చగాడు దివ్యపురుషుని కధ ఉంది.


ఒకరోజు ఆకాశంలో నుండి ఒక బంగారురథం వచ్చి బిచ్చగాడి ప్రక్కనే దిగింది,అందులో ఉన్న దివ్య పురుషుడుని చూసి తను చాలా అద్రుష్ట వంతుడనై పొవచ్చు అని బిచ్చగాడు అనుకున్నాడు.కాని ఆశ్చర్యంగా ఆ దివ్య పురుషుడేవచ్చి బిచ్చగాడిని బిక్షం అడుగసాగాడు,నిరాశతో తన దురద్రుష్ట్తానికి తిట్టుకుంటూ,తన జోలిలొ నుండి ఒక బియ్యపు గింజ తీసి ఆదివ్యపురుషునికి బిక్ష వెసాడు.ఒక గింజ పోయిందని చాలా బాధ పడ్డాడు.ఇంటికి వచ్చి పడుకొబోయె ముందు ఆ రోజు బిక్ష ఎంతవచ్చిందో చూసుకొనేందుకు తన జొలి విప్పిచూసాడు అందులో ఒక బంగారపు గింజ కనిపించింది ఆశ్చర్యపోయాడు. అది తను ఆ దివ్య పురుషునికి ఇచ్చిన దానికి ప్రతిఫలం అని వెంటనే గుర్తించాడు.తన దగ్గర వున్నవన్ని అతనికి వెయ్యనందుకు తనని తానే తిట్టుకున్నాడు.


ఇవ్వడం నేర్చుకో,ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ గా నీవు పొందుతావు.అలాకాకుండా దాచిపెట్టుకుంటే పరులపాలు అయిపోతుంది.తరచ్హుగా స్వార్ధ ప్రయోజనాలకు పాటు పడడానికే మన మనస్సు అలవాటు పడిపోయింది.వ్యక్తి తన స్వార్ధం కోసం కాకుండ అందరికోసం పాటుపడలో స్రుజనాత్మకతవుంది.మనం స్రుజనాత్మకంగా వుంటే,గొప్ప సంత్రుప్తి కలుగుతుంది.ఇంతకు మించి సత్రుప్తినిచ్చేది మరొకటిలేదు.
ఆలోచించండి,మూలతత్వ సారాన్ని జీర్ణించుకోండి.జీవితాన్ని మించిన గొప్ప కానుక లేదు.మానవాళికి చేసే మహోపకారం, లోకానికి సేవ చెయ్యడం.రండి ఆ సేవచేసి భగవంతుని క్రుపకు పాత్రులవుదాము.

Saturday, July 17, 2010

ఒక్కసారి ఆలోచిద్ధాం

నీ భార్యని ప్రేమించు, ఆమె నీ మీద ప్రేమ చూపుతుంది అంటున్నారు.నేను నా భార్యని మనసార ప్రేమిస్తున్నాను, కాని ఆమె నా మాట వినడం లేదు.ప్రతీ దానికి నన్ను అవమానించి మాట్లాడుతుంది.అటువంటి మనిషి తో నేనింకా ఏం ప్రేమ చూపగలను? ఇది చాల మంది భర్తల ప్రశ్న.
అస్సలు భార్య అనే ద్రుక్కొణం నుంచి చూడడం చేత వచ్చే ఇబ్బంది ఇది.ఉదాహరణకి మీ పిల్లల సంగతే తీసుకొండి.వాళ్ళు మీరు చెప్పినట్లు నడుచుకుంటున్నారా అన్ని విషయాల్లో? లేదుకదా? అంతమాత్రంచేత వాళ్ళకి మీరంటే ప్రేమ, గౌరవం లేదని అర్థమా? అథేవిధంగా మనం ఒకరి మీద ప్రేమ చూపినంతమాత్రన వారు మనం చెప్పినట్లు నడచుకోవాలనే నియమంలేదు.

ఇతర దేశాలతో పొలిస్తే దాంపత్య జీవితం చెదిరిపోకుండా వుంటున్నది మన దేశంలొనే.ఆదర్శ కుటుంబం అంటే ఎలా వుండాలో తెలుసుకోవడానికి మనకుటుంబాలనే ఆదర్శంగా తీసుకుంటున్నారు విదేశీయులు.మగవారికి ఒక్కమాట- మనది పుణ్యభూమి.నీతిగా,నిజాయితీగా జీవించడం మన స్త్రీల నైజగుణం.కొందరిలో కోపం,ఆవేశం వుండవచ్చు.కానివాళ్ళు నీతి తప్పరు.కాని విథేశాల్లొ ఎందరు స్త్రీలకి వర్తిస్తుంది.


భార్యా భర్తల మధ్య సంబంధం ప్రేమతో కూడినదై వుండాలి తప్పా దేనినో పొందాలని ఆశించినది కాకూడదు.ప్రేమ పరివర్తన చెంది,నిర్మలమై స్వచ్చమైనది అవ్వాలి.అప్పుడే మనలో విభేదాలకు అతీతంగా ఎదిగామని,మనం వాటికి భానిసలం కాదని గుర్తిస్తాము


"భిడ్డల కోసమని బలవంతాన మీతో కాపురం చేస్తున్నాను.వీళ్ళే లేకపొతే ఎప్పుడో తెగతెంపులు చేసుకుని తాళి బొట్టు మీ మొహాన కొట్టి వెళ్ళిపొయేదాన్ని" అని బహిరంగంగానే తమ అసంత్రుప్తిని ప్రకటించి అసహ్యంతో సంసారం సాగించే భార్యలు ఎందరో. ఈ పరిస్థితికి కారణం ఎవ్వరో ఆలోచించండి.
నందనవనంలా కళకళలాడుతూ వుండాల్సిన సంసారజీవితాలు ఎండి బీటలు వారడానికి కారణం ఏమిటి?ఆజన్మ శత్రువుల్లా తల్లితండ్రులు తగువులాడుకుంటూ వుంటే నిస్సహాయంగా బిక్కమొహాలతోచూస్తూ మనోవేదనికి గురవుతున్న పసిపిల్లల పరిస్తితి ఏమిటి అని ఒక్కసారైన ఆలొచించారా?

ఈ పరిస్తితి మారాలంటే ఏమిచెయ్యాలి?కుటుంబాన్ని ఒక ఆనంద బ్రుందావనంలా మార్చుకోవాలి.ఇందుకు చిన్న జీవిత సత్యాన్ని మనంగుర్తించాలి.భార్యా భర్తా అన్నప్పుడు వాళ్ళ మద్య అభిప్రాయభేథాలు,సమస్యలు రావడం సర్వ సాదారణం.అది సహజం.ఇవి లేని దంపతులు ప్రపంచంలో ఎక్కడా వుండరు.ముందుగా ఈ నిజాంన్ని మనం అర్థం చేసుకోవాలి.ఎన్ని అభిప్రాయభేదాలున్నా,ఎన్ని సమస్యలు వచ్చినా అవి తీవ్రరూపం దాల్చి దాంపత్య జీవితానికి భంగం వాటిల్లకుండా అప్పటికప్పుడు పరిష్కరించుకోగల నేర్పుని మనం అలవర్చుకోవాలి.

ఇక్కడ మరో విషయం ముఖ్యంగా గమనించాలి, అభిప్రాయభేదాలు కాని, సమస్యలు కాని మనకు దుఖం కలిగించడంలేదు.కాని మనం వాటిని ఏ ద్రుక్కోణం నుంచి చూస్తున్నామో అదే బాథలకి అసలు కారణం


భార్యా భర్తల మధ్య సంబంధం సుముఖంగా వుండాలని కోరుకుంటున్నారా? అయితే ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు"నీవల్లే ఇలాజరిగింది" అని ఒకరిమీదొకరు నిందలు మోపడo మానుకోండి.సమస్యకి భాద్యత స్వీకరించినపుడే ఆ సమస్య పరిష్కరించాలనే పట్టుదల కూడా కలుగుతుంది.పరిష్కారానికి ప్రయత్నించినప్పుడు స్వతాహాగా మనలో ఆత్మ బలం పెరుగుతుంది.ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి,సంసారజీవితాన్ని ఆనంద బ్రుందావనం చేసుకోండి.

అన్నోన్య దాంపత్య సిధ్ధిరస్తు