Saturday, July 17, 2010

ఒక్కసారి ఆలోచిద్ధాం

నీ భార్యని ప్రేమించు, ఆమె నీ మీద ప్రేమ చూపుతుంది అంటున్నారు.నేను నా భార్యని మనసార ప్రేమిస్తున్నాను, కాని ఆమె నా మాట వినడం లేదు.ప్రతీ దానికి నన్ను అవమానించి మాట్లాడుతుంది.అటువంటి మనిషి తో నేనింకా ఏం ప్రేమ చూపగలను? ఇది చాల మంది భర్తల ప్రశ్న.
అస్సలు భార్య అనే ద్రుక్కొణం నుంచి చూడడం చేత వచ్చే ఇబ్బంది ఇది.ఉదాహరణకి మీ పిల్లల సంగతే తీసుకొండి.వాళ్ళు మీరు చెప్పినట్లు నడుచుకుంటున్నారా అన్ని విషయాల్లో? లేదుకదా? అంతమాత్రంచేత వాళ్ళకి మీరంటే ప్రేమ, గౌరవం లేదని అర్థమా? అథేవిధంగా మనం ఒకరి మీద ప్రేమ చూపినంతమాత్రన వారు మనం చెప్పినట్లు నడచుకోవాలనే నియమంలేదు.

ఇతర దేశాలతో పొలిస్తే దాంపత్య జీవితం చెదిరిపోకుండా వుంటున్నది మన దేశంలొనే.ఆదర్శ కుటుంబం అంటే ఎలా వుండాలో తెలుసుకోవడానికి మనకుటుంబాలనే ఆదర్శంగా తీసుకుంటున్నారు విదేశీయులు.మగవారికి ఒక్కమాట- మనది పుణ్యభూమి.నీతిగా,నిజాయితీగా జీవించడం మన స్త్రీల నైజగుణం.కొందరిలో కోపం,ఆవేశం వుండవచ్చు.కానివాళ్ళు నీతి తప్పరు.కాని విథేశాల్లొ ఎందరు స్త్రీలకి వర్తిస్తుంది.


భార్యా భర్తల మధ్య సంబంధం ప్రేమతో కూడినదై వుండాలి తప్పా దేనినో పొందాలని ఆశించినది కాకూడదు.ప్రేమ పరివర్తన చెంది,నిర్మలమై స్వచ్చమైనది అవ్వాలి.అప్పుడే మనలో విభేదాలకు అతీతంగా ఎదిగామని,మనం వాటికి భానిసలం కాదని గుర్తిస్తాము


"భిడ్డల కోసమని బలవంతాన మీతో కాపురం చేస్తున్నాను.వీళ్ళే లేకపొతే ఎప్పుడో తెగతెంపులు చేసుకుని తాళి బొట్టు మీ మొహాన కొట్టి వెళ్ళిపొయేదాన్ని" అని బహిరంగంగానే తమ అసంత్రుప్తిని ప్రకటించి అసహ్యంతో సంసారం సాగించే భార్యలు ఎందరో. ఈ పరిస్థితికి కారణం ఎవ్వరో ఆలోచించండి.
నందనవనంలా కళకళలాడుతూ వుండాల్సిన సంసారజీవితాలు ఎండి బీటలు వారడానికి కారణం ఏమిటి?ఆజన్మ శత్రువుల్లా తల్లితండ్రులు తగువులాడుకుంటూ వుంటే నిస్సహాయంగా బిక్కమొహాలతోచూస్తూ మనోవేదనికి గురవుతున్న పసిపిల్లల పరిస్తితి ఏమిటి అని ఒక్కసారైన ఆలొచించారా?

ఈ పరిస్తితి మారాలంటే ఏమిచెయ్యాలి?కుటుంబాన్ని ఒక ఆనంద బ్రుందావనంలా మార్చుకోవాలి.ఇందుకు చిన్న జీవిత సత్యాన్ని మనంగుర్తించాలి.భార్యా భర్తా అన్నప్పుడు వాళ్ళ మద్య అభిప్రాయభేథాలు,సమస్యలు రావడం సర్వ సాదారణం.అది సహజం.ఇవి లేని దంపతులు ప్రపంచంలో ఎక్కడా వుండరు.ముందుగా ఈ నిజాంన్ని మనం అర్థం చేసుకోవాలి.ఎన్ని అభిప్రాయభేదాలున్నా,ఎన్ని సమస్యలు వచ్చినా అవి తీవ్రరూపం దాల్చి దాంపత్య జీవితానికి భంగం వాటిల్లకుండా అప్పటికప్పుడు పరిష్కరించుకోగల నేర్పుని మనం అలవర్చుకోవాలి.

ఇక్కడ మరో విషయం ముఖ్యంగా గమనించాలి, అభిప్రాయభేదాలు కాని, సమస్యలు కాని మనకు దుఖం కలిగించడంలేదు.కాని మనం వాటిని ఏ ద్రుక్కోణం నుంచి చూస్తున్నామో అదే బాథలకి అసలు కారణం


భార్యా భర్తల మధ్య సంబంధం సుముఖంగా వుండాలని కోరుకుంటున్నారా? అయితే ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు"నీవల్లే ఇలాజరిగింది" అని ఒకరిమీదొకరు నిందలు మోపడo మానుకోండి.సమస్యకి భాద్యత స్వీకరించినపుడే ఆ సమస్య పరిష్కరించాలనే పట్టుదల కూడా కలుగుతుంది.పరిష్కారానికి ప్రయత్నించినప్పుడు స్వతాహాగా మనలో ఆత్మ బలం పెరుగుతుంది.ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి,సంసారజీవితాన్ని ఆనంద బ్రుందావనం చేసుకోండి.

అన్నోన్య దాంపత్య సిధ్ధిరస్తు

No comments:

Post a Comment