Friday, July 23, 2010

విజేత మీరే అనుకోండి...



    ఒక పోష్ట్ గ్రాడ్యుయేట్ చదువు పూర్తి చేసుకుని పదేళ్ళకు పైగా అయ్యింది,ఎక్కడా ఉద్యోగం రాలేదు,కనీసం ఎంప్లాయిమెంట్ ఆఫీసు నుంచి కూడా ఒక్క ఇంటర్యూ కూడ పిలుపు రాలేదు.అందుకని ఒక హొటల్ లొ క్యాషియరుగా పనిచేయడం మొదలుపెట్టాడు.అతని విద్యార్హతలకి,అతను చేస్తున్న ఉద్యోగానికి ఏవిధమైన సంభంధంలేదు.ఒకసారి కౌంటరులో డబ్బు తక్కువ వచ్చింది.అది ఏవిధంగా జరిగిందో అతనికి తెలియదు.ఆ అపనింద తనపై పడుతుందేమో అన్న భయం అతని మనసుని కలచివేసింది.ఎలాగైన ఆడబ్బుని భర్తీ చేద్దామని అతని భార్య నగలు తాకట్టు పెట్టాలనుకుని భార్యని అడిగాడు అందుకు ఆమె ఒప్పుకోలేదు,తల్లిని అడిగాడు అమె కూడా ససేమిరా అంది.అతని భార్య,తల్లికూడా తన గౌరవం కాపాడానికి సిద్దంగ్గలేరు అని ఎంతో కుమిలిపోయాడు.

    ఇక్కడ ఒక్కసారి అతన్ని క్షుణ్ణంగా పరిసీలిద్దాం, అతని తల్లి,భార్య నమ్మటం సంగతి పక్కన పెడితే అతన్ని అతనే నమ్మలేదు.బాగా లోతుగా ఆలోచిస్తే విపత్తులని అంగీకరించే ఆత్మస్తైర్యం అతనికి లేదు,అందుకే ఇష్టం లేని ఉద్యోగాన్నే అంటిపెట్టుకుని వున్నాడు.ఉద్యోగం అంటే అఐష్టం కాబట్టి పని మీద పూర్తిగా మనసు పెట్టి చేయలేకపొయాడు,దానివల్లే ఎంత డబ్బు తక్కువయ్యిందో కూడా గమనించుకోలేకపోయాడు.సమస్య అతని భార్యో ,తల్లో కాదు.అసలు అతనికి అతనే పెద్ద సమస్య.అతనిలోని ఆత్మ స్తైర్యం లోపించడమే అతని మొదటి సమస్య ముందుదాని నుండి అతను బయటపడాలి.

    
    ఆత్మస్థైర్యం పెంచుకోడానికి ముఖ్యంగా మూడు లక్షణాలు తప్పక నేర్చుకోవాలి.మొదటిది ఎప్పుడూ కలతలకి,ధుఖాలకి కృంగిపోకూడదు.రెండవది ఇష్టమైన ఒక రంగంలో,లేదా,ఇష్టమైన పనిలో ప్రావీణ్యం సంపాదించుకోవాలి.మూడవది బాధ్యత స్వీకరించడం నేర్చుకోవాలి.చదువూ,డబ్బు లేనివారు,చివరికి కాళ్ళూ చేతులు లేనివారు కూడా జీవితoలో విజయం సాధించారు.అలాంటివారు చాలామందేవున్నారు.కాని ఆత్మస్థైర్యం లేకుండా విజయం సాధించినవారు ఒక్కరూ లేరు.

   అబ్రహం లింకన్ జీవితాన్నే చూద్దాం లెక్కలేనన్ని అపజయాలు ఎదురయ్యాయి.ఏడవ ఏట కుటుంబ వివాదాల వల్ల అతని కుటుంబం వీధిన పడింది.9వ ఏట తల్లి మరణించింది,22వ ఏట గుమాస్తా ఉద్యోగం కాస్తా పోయింది,25వ ఏట లెజిస్లేటర్ ఎన్నికలలో ఓడిపొయాడు,27 వ ఏట నాడీ మండలం దెబ్బతింది,28వ ఏట ప్రియురాలిని పోగోట్టుకున్నాడు,30 వ ఏట స్పీకర్ ఎన్నికలలో ఓడిపోయాడు,35 వ ఏట కాంగ్రెస్ ఎన్నికలలో ఓడిపోయాడు.46 వ ఏట సెనటోరియల్ ఎన్నికలలో ఓడిపోయాడు,ఆ కాలంలోనే తన కొడుకుని పోగోట్టుకున్నాడు.47 వ ఏట వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలలో ఘోర పరాజయం పోందాడు,అయినా ఎంతమాత్రం అతని ఆత్మస్థైర్యం చెక్కుచెదరలేదు.ఈ పరాజయాలన్ని అతని ఆత్మస్థైర్యాన్ని ఏ మాత్రం కృంగదీయలేదు.52 వ ఏట ఆయన అమెరికా అధ్యక్ష పదవి పోందాడు.
   కాబట్టి గతం మన ఆత్మస్థైర్యాన్ని కృంగదీయకుండా చూసుకోవాలి.                      






  

  
  

  

      

4 comments:

  1. Evandoi , malli post cheyadam start. Heyandi.

    ReplyDelete
  2. తెలుగు న్యూస్ పొర్టల్ ఇక్కడ మీరు కొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers, మరియు interviews అన్నీటి గురించి తెలుసుకొవచ్చు.

    ReplyDelete
  3. nice blog
    hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support
    https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

    ReplyDelete
  4. good post.
    https://goo.gl/Yqzsxr
    plz watch and subsribe our channel.

    ReplyDelete