Tuesday, July 20, 2010

మనలో శక్తిని తెలుసుకుందాం

ప్రపంచ వ్యాప్తంగా జపాన్ దేశ వస్తువులకి ఎంత గిరాకీ వుందో ఎవ్వరికి వేరె చెప్పనక్కరలేదు.జపాన్ ఉత్పత్తులు తమ దేశంలో ప్రవేశిస్తాయేమోనని అమెరికా,ఇరోపా దేశాలు ఇప్పటికి భయపడుతూనేవున్నాయి.ఆటోమొబైల్ రంగంలో ముందంజలో వున్నహొండా కంపనీ ఎలా ప్ర్రారంభమయ్యిందో ఒకసారి చూసి దాని బట్టి మనం ఏమినేర్చుకోవాలో తెలుసుకుందాము.
హోండా అనే జపాన్ దేశస్థుడు హొండా కంపనేకి మూల కారకుడు.హొండా చాలా నిరాడంబరుడు.కార్లు బాగా నడిచేందుకు క్రొత్తరకం పిస్టన్ రూపొందించాలని ప్రయత్నించాడు.తన ప్రయత్నం విజయవంతము ఐతె,అది ఆటోమోబైల్ రంగంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకునిరాగలదని అతడు బలంగా నమ్మాడు .తను రూపోదించిన పిస్టన్ వివరాలను టొయోటా కంపనీవారికి చూపించాడు,కానీ వివరాలు తెలుసుకోకుండానే ఆ కంపనీ ఇంజనీర్లు అతని ప్రతిపాదనని త్రోసిపుచ్చారు.అలాగని హొండా నిరాశ చెందలేదు.టొయోటా కంపని ఇంజనీర్లని కలవడానికి పదేపదే ప్రయత్నించాడు.చివరికి అతని ప్రయత్నం ఫలించింది.కాని వాళ్ళు అతని క్రుషిని అభినందించడానికి బదులు హేళన చేసారు.అయినా సరే నిరుత్సాహపడలేదు,వివారాలన్నీ విపులీకరించి ఒప్పించగలిగాడు.చివరి టొయోటా కంపనికి పిస్టన్ తయారుచేసి ఇచ్చెందుకు ఆర్డరు సంపాదించాడు.
తన దగ్గరవున్న ఆస్తిని అమ్మి పిస్టన్లు తయారు చేసె ఫ్యాక్టరిని పెట్టాడు.అంతలో అకస్మాత్తుగా జపాన్లో భూకంపం వచ్చి ఆ ఫ్యాక్టరీ కాస్త నేల మట్టం అయ్యింది.ఐనాసరే తన సామర్ధ్యం మీద తనకి అపారనమ్మకం పెంచుకుని మళ్ళీ క్రొత్తగా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మొదలుపెట్టాడు,ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి అయ్యి ఉత్పత్తి ప్రారంభించే వారం రోజుల ముందు రెండవ ప్రపంచయుద్దం వచ్చి,జపాన్ మీద బాంబుల వర్షం కురిపించింది,జపాన్ దేశంతోపాటు హొండా కంపని కూడా సమూలంగా ద్వంసం అయిపోయింది.
ఆ సంఘటనతో తన ఫ్యాక్టరినీ,ఆస్తిని,స్నేహితులని,అందరిని పోగొట్టుకున్నాడు.హొండాకి మాత్రం ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు.తన ప్రయత్నాలు కొనసాగించి మూడోసారి ఫ్యాక్టరిని నిర్మించాడు.ఇవాళ కార్ల తయారిలో టొయోటా కంపనీ కంటే హొండా కంపనీ ముందంజలోఉంది.పట్టుదలకి మారుపేరే కాక హొండా అనే పేరుకే వన్నెతెచ్చాడు "హొండా".

చిన్నచిన్న పరాజయాలకీ మనం క్రుంగిపోతూవుంటాం,సమస్యలు వరుసగా వస్తే నిరాశకి గురవుతాము.విజయవంతులు ఎప్పుడు సమస్యలో ఒక భాగంగానే వుంటారు తప్పా సమస్యాబాధితులు మాత్రంకారు.మరికొతమందిని గురించి తెలుసుకుందాము.....

"ఇనస్టీన్" మొద్దూబ్బాయి అని ముద్ర వేసి అతడిని స్కూల్ నుండి పంపించివేసారు,దానితో అతను నిరాశచెంది చదువు మానేసివుంటే అంతటి శాస్త్రవేత్త గురించి ప్రపంచానికి తెలిసేదేకాదెమో!

"నార్మా జీన్ బేకర్"అనే అమ్మాయి మోడలింగ్ వ్రుత్తిని చెపట్టాలనుకుంది,మోడలింగ్ కంపెని ఆమెను తిరస్కరించింది,మోడలింగ్ బదులుగా ఒక గుమాస్తా వుద్యోగం ఇచ్చింది,అంతటితో ఆమె కలలకి సమాధి కట్టేసి వుంటే "మార్లిన్ మన్రో" అనే అందాల చలనచిత్ర నటి ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్వప్న సుందరి కాలేదెమో!
సహజంగా స్రుజనాత్మకత లేని కారణంగా ఒక వార్తాపత్రిక యజమాని ఒక చిత్రకారుడిని ఉద్యోగం లోంచి తీసేసాడు,కాని ఆ చిత్రకారుడు తన స్రుజనాత్మక శక్తితో "మిక్కీమౌస్" అనే బొమ్మకు ప్రాణంపోసి "వాల్ట్ డిస్నీ"అనే కార్టూన్ మహాసామ్రాజ్యానికి స్రుస్టికర్త అయ్యాడు.

"మనము తప్పక విజయము సాధిస్తాము" అన్న తపన మనలో ఎప్పుడు మనలో రగులుతూ ఉండాలి,దానిని మనం నీరుకార్చుకోకూడదు.విజయశిఖరాలు చేరుకోవాలంటే ఎన్నో అవరోధాలు ఎదుర్కోవలసి వస్తుంది.మధ్యలో నిరాశ చెంది ప్రయత్నాన్ని విరమించుకుంటే విజయాన్ని ఆస్వాదించలేము.

No comments:

Post a Comment